News December 9, 2024
కష్టాల్లో ఉన్న స్నేహితులకు రష్యా ద్రోహం చేయదు: రాయబారి

సిరియాలో తిరుగుబాటుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల రష్యన్ ఫెడరేషన్ శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసద్, అతని కుటుంబం మాస్కోకు చేరుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితులకు రష్యా ఎప్పుడూ ద్రోహం చేయదు. ఇదే రష్యా-అమెరికాకు మధ్య ఉన్న వ్యత్యాసం’ అని రాసుకొచ్చారు.
Similar News
News September 24, 2025
చంద్రఘంటా అలంకారంలో భ్రమరాంబికాదేవి

శ్రీశైల క్షేత్రంలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి నేటి సాయంత్రం చంద్రఘంటా దేవి రూపంలో కనిపిస్తారు. సింహ వాహనంపై బంగారు కాంతితో మెరిసిపోతూ పది చేతుల్లో ఖడ్గం, బాణం సహా వివిధ అస్త్రాలు ధరించి, తలపై అర్ధ చంద్రాకారంతో చంద్రఘంటా దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. నవదుర్గల్లో మూడో స్వరూపమైన చంద్రఘంటను దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతీతి.
News September 24, 2025
అక్టోబర్ 1 నుంచి ఆధార్ ఛార్జీలు పెంపు

వచ్చే నెల 1 నుంచి ఆధార్ సర్వీస్ ఛార్జీలు పెరగనున్నాయి. తప్పుల సవరణకు లేదా వివరాల అప్డేట్‌కు ప్రస్తుతం రూ.50 ఉండగా రూ.75కు, బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ.100 ఉండగా రూ.125కు పెంచుతున్నట్లు UIDIA తెలిపింది. పోర్టల్ ద్వారా నేరుగా పొందే సేవలకు ఛార్జీలను రూ.50 నుంచి రూ.75కు పెంచినట్లు పేర్కొంది. పోయిన ఆధార్ స్థానంలో కొత్తది కావాలంటే రూ.40 అప్లికేషన్ ఫీజు చెల్లించాలని వెల్లడించింది.
News September 24, 2025
రాష్ట్రంలో 2 సెకన్లు కంపించిన భూమి

AP: ఒంగోలులో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటలకు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కంపనాలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. 10kmల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.