News September 10, 2024

చంద్రుడిపై రష్యా, చైనా అణు రియాక్టర్.. భారత్ ఆసక్తి..?

image

భవిష్యత్తు అవసరాల కోసం చంద్రుడిపై అణు రియాక్టర్‌ను నిర్మించాలని రష్యా, చైనా భావిస్తున్నట్లు రష్యా వార్తాసంస్థ TASS తెలిపింది. ఆ దేశ అణు కార్పొరేషన్ రొసాటమ్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ఉంటుందని పేర్కొంది. దీనిపై భారత్‌ ఆసక్తి చూపిస్తోందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో చంద్రుడిపై ఏర్పాటయ్యే నిర్మాణాలకు ఈ కేంద్రం ద్వారా విద్యుత్‌ సరఫరా చేయొచ్చని వివరించింది. కాగా ఈ ప్రకటనపై ఇస్రో స్పందించాల్సి ఉంది.

Similar News

News October 13, 2024

మీ పిల్లలకు ఇవి నేర్పుతున్నారా?

image

వయసు పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని స్కిల్స్ నేర్పించాలి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సాయం చేయడం వంటివి నేర్పాలి. చెట్లు నాటడం, సంరక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. డబ్బు విలువ తెలియజేయాలి, వస్తువులపై ధరలు, క్వాలిటీ వంటివి చూపించాలి. మార్కెట్‌లో బేరాలు ఆడటం నేర్పించాలి. ఎమోషనల్ బ్యాలెన్స్‌పై అవగాహన కల్పించాలి. పెద్దలను గౌరవించేలా తీర్చిదిద్దాలి.

News October 13, 2024

‘దసరా’ దర్శకుడితో నాని మరో మూవీ

image

‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్‌కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

News October 13, 2024

సంజూ శాంసన్ సెల్ఫ్‌లెస్ ప్లేయర్: సూర్య

image

వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.