News June 27, 2024

రష్యా ఉపగ్రహం ముక్కలు.. ISSలో కలకలం

image

రష్యా 2022లో డీకమిషన్ చేసిన RESURS-P1 అనే ఉపగ్రహం తాజాగా ముక్కలైంది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కలకలం రేగింది. అందులోని వ్యోమగాములు అత్యవసరంగా సురక్షిత పాడ్స్‌లో తలదాచుకున్నారు. శాటిలైట్ ఎందుకు ముక్కలైందో తెలియాల్సి ఉందని US అంతరిక్ష శాఖ అధికారులు పేర్కొన్నారు. భూమి చుట్టూ శకలాల పరిభ్రమణం వేగం తీవ్రంగా ఉంటుంది. మిల్లీమీటర్ల సైజులో ఉండే శకలం కూడా పెను విధ్వంసాన్ని సృష్టించగలదు.

Similar News

News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

News December 5, 2024

UAN యాక్టివేషన్ గడువు పొడిగింపు

image

కేంద్రం తీసుకొచ్చిన ELI పథకం ప్ర‌యోజ‌నాల కోసం ఆధార్ అనుసంధాన UAN యాక్టివేషన్ గడువును EPFO పొడిగించింది. నవంబర్ 30తోనే డెడ్‌లైన్ ముగియగా దాన్ని డిసెంబర్ 15 వరకు పెంచింది. ఈ స్కీం ద్వారా ఉద్యోగుల‌కు 3 విడ‌త‌ల్లో రూ.15 వేల వ‌ర‌కు సాయం అందుతుంది. ఉద్యోగికి, యజమానికి ప్రోత్సాహకాలు, ప్రతి కొత్త ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేల వరకు కేంద్రం ఇస్తుంది.

News December 5, 2024

పవర్ గ్రిడ్ పతనం.. క్యూబాలో అంధకారం

image

క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం అలుముకుంది. దీంతో దేశంలోని పాఠశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతపడ్డాయి. దేశంలోని లక్షలాది మంద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక జనం అల్లాడుతున్నారు. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు మూగబోవడంతో దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు. కాగా గ్రిడ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ విద్యుత్‌శాఖ మంత్రి విసెంటే డి లా ఒలెవీ తెలిపారు.