News April 6, 2025

UK సబ్‌మెరైన్లపై రష్యా నిఘా!

image

తమ న్యూక్లియర్ సబ్‌మెరైన్లను ట్రాక్ చేసేందుకు రష్యా రహస్య సెన్సర్లను ఉపయోగిస్తోందని UK ఆరోపిస్తోంది. జలాంతర్గాములతోపాటు సముద్రంలోని కేబుల్స్, పైప్‌లైన్స్‌ విధ్వంసానికి కుట్ర చేస్తోందని పేర్కొంటోంది. దీన్ని ధ్రువీకరిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. గత 15 నెలల్లో బాల్టిక్ సముద్రంలో(యూరప్ మధ్య భాగం) 11 స్పై డివైజ్‌లు తీరానికి కొట్టుకొచ్చినట్లు పేర్కొంటున్నాయి.

Similar News

News April 20, 2025

మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా?

image

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అధిక వేడి కారణంగా కొందరు వడదెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారంతోపాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో మార్పులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

News April 20, 2025

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన KCR

image

ఏపీ సీఎం చంద్రబాబుకు KCR జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు BRS ట్వీట్ చేసింది. ‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని KCR ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కేసీఆర్ కోరుకున్నారు’ అని పేర్కొంది. అటు విజయసాయిరెడ్డి కూడా CBNకు విషెస్ చెప్పారు.

News April 20, 2025

భార్య/భర్తల్లో ఈ లక్షణాలు ఉంటే..

image

ఈ లక్షణాలుంటే మీ పార్ట్‌నర్‌కు మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టేనని, జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*ఏ విషయాన్నీ డిస్కస్ చేయకపోవడం
*పాజిటివ్ విషయాలకూ చిరాకు పడటం
*ఫ్యూచర్ గురించి పట్టించుకోకపోవడం
*ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకపోవడం
*మీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడుకోవడం
*కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడానికి కూడా దగ్గరకి రాకపోవడం

error: Content is protected !!