News April 4, 2024
తుక్కు వాహనాలు దర్జాగా రోడ్డెక్కుతున్నాయ్!

హైదరాబాద్ మహానగరంలో కోటిన్నరకు పైగా జనాభా ఉండగా.. 80 లక్షలకు పైగా వాహనాలు ఉన్నట్లు ఆర్టీఏ డేటా చెబుతోంది. వీటిలో 21 లక్షలకు పైగా (25%) వాహనాలు 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసుగలవే ఉన్నాయి. ఇందులో 17 లక్షల బైక్స్, 3.5 లక్షల కార్లు, లక్ష గూడ్స్ వాహనాలు, 20 వేల ఆటో-రిక్షాలు, 4000 క్యాబ్‌లు ఉన్నాయి. ఈ వాహనాల వల్ల వాయు కాలుష్యం పెరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
Similar News
News April 23, 2025
దూబే మంచి మనసు.. 10 మందికి ఆర్థిక సాయం

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. రూ.70వేల చొప్పున పది మందికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాతన కిట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. TT, ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, చెస్, క్రికెట్ తదితర రంగాల్లోని క్రీడాకారులకు ఈ డబ్బు అందనుంది.
News April 23, 2025
డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <
News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.