News October 1, 2024

ఆస్ట్రేలియా సిరీస్‌కు రుతురాజ్ ఎంపిక?

image

ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమ్ ఇండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌ను మూడో ఓపెనర్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బంగ్లాతో జరగబోయే T20 సిరీస్‌కు గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడంతో BCCIపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ టెస్టు సిరీస్ ముందు ఆయన అలసిపోకుండా ఉండేందుకే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కివీస్‌తో టెస్టు సిరీస్‌కూ ఆయనను ఎంపిక చేస్తారని టాక్.

Similar News

News October 15, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

image

AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. నకిలీ బిల్లులతో కొనుగోళ్లు జరిపినట్లు, వ్యక్తిగత ఖాతాలకు ఈ సంస్థ నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే కేసులో గతేడాది చంద్రబాబు జైలుకెళ్లారు.

News October 15, 2024

Air India విమానానికి బాంబు బెదిరింపు.. కెనడాకు మ‌ళ్లింపు

image

ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న Air India విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని అత్య‌వ‌స‌రంగా కెనడాలోని ఇకలూయిట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఆన్‌లైన్ పోస్టు ద్వారా అందిన భ‌ద్ర‌తా ముప్పు కార‌ణంగా మార్గ‌మధ్యలో ఉన్న AI127 విమానాన్ని మ‌ళ్లించిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల న‌కిలీ బెదిరింపులు అధిక‌మైనా బాధ్య‌త‌గ‌ల సంస్థగా వీటిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు తెలిపింది.

News October 15, 2024

తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు అన్వర్, అధిర్ రంజన్ చౌదరీని ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్కను మహారాష్ట్రలోని మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర రీజియన్లకు పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.