News November 12, 2024
రైతుభరోసా డబ్బులు ఎప్పుడంటే?
TG: రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 10, 2024
TODAY HEADLINES
* గత పాలకులు తెలంగాణ తల్లిని విస్మరించారు: రేవంత్
* ప్రభుత్వం పెట్టింది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR
* నాగబాబుకు మంత్రి పదవి.. నిర్ణయించిన CBN
* రాజ్యసభ సభ్యులుగా మస్తాన్‌రావు(TDP), సానా సతీశ్(TDP), ఆర్.కృష్ణయ్య(BJP) పేర్లు ఖరారు
* RBI కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
* TG గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
* పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న మోహన్‌బాబు, మనోజ్
News December 10, 2024
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి
ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ దారుణంగా ఓడిపోయింది. హరియాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచులో 46-25 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. TTలో ఆశిష్ నర్వాల్ సూపర్ 10 సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
News December 10, 2024
కాలుష్యాన్ని నియంత్రించే బ్యాక్టీరియా.. IIT గువాహటి శాస్త్రవేత్తల ఆవిష్కరణ
బ్యాక్టీరియా ద్వారా మీథేన్, కార్బన్ డయాక్సైడ్‌ను శుద్ధమైన బయోఫ్యూయల్‌గా మార్చే విధానాన్ని IIT గువాహటి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. Prof.దేవాశిష్, కళ్యాణి సాహు బృందం ఆవిష్కరించిన ఈ విధానం ద్వారా మెథానోట్రోఫిక్ బ్యాక్టీరియా కాలుష్య కారకాలను శుద్ధిచేస్తుంది. ప్రయోగ దశలో ఉన్న ఈ నమూనా ప్రస్తుతం 5L పరిమాణంలో ఉంది. పర్యావరణ అనుకూల ఇంధన ఆవిష్కరణలో ఇది కీలక ముందడుగని వారు పేర్కొన్నారు.