News April 5, 2024
ఎస్ఏ-2 పరీక్షల తేదీలు మార్పు

TG: సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News December 27, 2025
ఈ IT ఉద్యోగులది చెప్పుకోలేని బాధ!

30-40 ఏళ్ల వయసున్న IT ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఓవైపు ప్రమోషన్లు లేక మరోవైపు లేఆఫ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న EMIలు, ఫ్యామిలీ బాధ్యతల మధ్య AI టెక్నాలజీని అందిపుచ్చుకోవడం సవాల్‌గా మారింది. Gen Z కుర్రాళ్లు తక్కువ జీతానికే AIతో స్మార్ట్‌గా పనిచేస్తుంటే సీనియర్స్ తమకు భారంగా మారారని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్కసారి జాబ్ పోతే Bounce Back అవ్వడం ఇప్పుడు అంత ఈజీ కాదు.
News December 27, 2025
న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్

TG: జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ CP సజ్జనార్ పేర్కొన్నారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పౌరులను హెచ్చరించారు. ‘మద్యం తాగి పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం. HYD మొత్తం ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్ నడుస్తోంది. ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయి. పోక్సో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 368 కేసుల్లో రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం’ అని తెలిపారు.
News December 27, 2025
జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.


