News April 5, 2024

ఎస్ఏ-2 పరీక్షల తేదీలు మార్పు

image

TG: సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News January 13, 2025

‘గేమ్ ఛేంజర్’ యూనిట్‌కు బెదిరింపులు.. కేసు నమోదు

image

‘గేమ్ ఛేంజర్’ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ చిత్రంపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్లు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

News January 13, 2025

నారావారిపల్లెలో సీఎం బిజీబిజీ

image

AP: సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో రోడ్లు, రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

News January 13, 2025

జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

image

AP: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ బరులు సిద్ధం చేసి నిర్వాహకులు పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పందేల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలైన TG, TN, కర్ణాటక నుంచి కూడా చాలామంది ఆసక్తితో కోడిపందేల కోసమే గోదావరి జిల్లాలకు రావడం విశేషం.