News August 23, 2024
సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు!
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఢిల్లీకి చెందిన వినోద్ కుమార్ చౌదరి బ్రేక్ చేశారు. సచిన్ పేరిట 19 గిన్నిస్ రికార్డులు ఉండగా, టైపింగ్లో వినోద్ 20 గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. 20వ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సచిన్ చేతుల మీదుగా అందుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని 5 సెకన్లలో బ్యాక్వర్డ్ టైపింగ్ చేసి ఆయన ఈ రికార్డు సృష్టించారు.
Similar News
News January 15, 2025
రేపు ఈడీ విచారణకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.
News January 15, 2025
దేశంలో ఎన్నో సమస్యలుంటే.. సైకిల్ ట్రాక్లు కావాలా?: సుప్రీంకోర్టు
‘దేశంలో పేదలకు సరైన నివాస వసతి లేదు. మురికివాడల్లో నివసిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవల కొరత ఉంది. ప్రభుత్వాలు వీటి కోసం నిధులు ఖర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్ల కోసమా?’ అని SC ప్రశ్నించింది. దేశంలో సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలన్న పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామని SC ప్రశ్నించింది.
News January 15, 2025
భారత్ ఘన విజయం
ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. 436 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఐరిష్ జట్టును 131 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 304 రన్స్ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. వన్డేల్లో భారత్కు ఇదే అతిపెద్ద విజయం. ఇండియా బౌలర్లలో దీప్తి 3, తనూజ 2, సాధు, సయాలి, మిన్నూ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది.