News August 23, 2024

సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు!

image

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఢిల్లీకి చెందిన వినోద్ కుమార్ చౌదరి బ్రేక్ చేశారు. సచిన్ పేరిట 19 గిన్నిస్ రికార్డులు ఉండగా, టైపింగ్‌లో వినోద్ 20 గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. 20వ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని సచిన్ చేతుల మీదుగా అందుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని 5 సెకన్లలో బ్యాక్‌వర్డ్ టైపింగ్ చేసి ఆయన ఈ రికార్డు సృష్టించారు.

Similar News

News September 15, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్లా నుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎదుటివారు తప్పులను లెక్కించేవారు చాలా మంది ఉంటారు. తమ తప్పులను తెలుసునేవారు కొందరే ఉంటారు. ఇతరుల తప్పులను గుర్తించేవారు తమ తప్పులను తెలుసుకోలేరు.

News September 15, 2024

విమాన ఆలస్యంపై షమీ పోస్ట్.. సోనూ సూద్ ఫన్నీ రిప్లై

image

తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైందంటూ క్రికెటర్ షమీ చేసిన పోస్టుకు యాక్టర్ సోనూ సూద్ సరదాగా స్పందించారు. ‘మళ్లీ నా ఫ్లైట్ ఆలస్యమైంది. ఎయిర్‌పోర్టు నాకు టెంపరరీ ఇల్లుగా మారిపోయింది’ అంటూ బాధగా ఉన్న ఫొటోలను షమీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఏమైందంటూ పలువురు కామెంట్స్ చేశారు. వీటికి సోనూ రిప్లై ఇస్తూ ‘భయ్యా.. ఎవరూ టెన్షన్ పడొద్దు. ఆయన ఇంట్లో పడుకున్నట్లే అక్కడా నిద్రపోతారు’ అని రాసుకొచ్చారు.

News September 15, 2024

సెప్టెంబర్ 15: చరిత్రలో ఈరోజు

image

1861: ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం
1892: పద్మభూషణ్ గ్రహీత, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పృథ్వీసింగ్ ఆజాద్ జననం
1942: నటుడు సాక్షి రంగారావు జననం
1967: ప్రముఖ నటి రమ్యకృష్ణ జననం
1972: ప్రముఖ డైరెక్టర్ కె.వి.రెడ్డి మరణం
జాతీయ ఇంజనీర్ల దినోత్సవము
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం