News September 4, 2024
నిద్రను త్యాగం చేసి ఉద్యోగం చేస్తున్నారా?
వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను అర్థం చేసుకోకుండా చాలా మంది తమ సమయాన్ని ఉద్యోగం కోసమే త్యాగం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందిన యువ పారిశ్రామికవేత్త కృతార్థ్ మిట్టల్ నిద్ర పోకుండా, ఆహారం తీసుకోకుండా పనిచేసి కెరీర్‌లో సక్సెస్ అయ్యారు. కానీ 25 ఏళ్లకే వివిధ ఆరోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిపాలయ్యారు. 5 గంటల కంటే తక్కువ నిద్రపోయి డైట్ పాటించకపోవడంతో ఇలా జరిగిందని, ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.
Similar News
News September 21, 2024
నేను ఏసీ వ్యాన్‌లో.. రజనీ నేలమీద: అమితాబ్
రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఆయన తన వీడియో మెసేజ్‌ను పంపించారు. ‘ఇది నా తొలి తమిళ సినిమా. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నేను, రజనీ కలిసి నటించాం. ఆ షూటింగ్‌లో నేను ఏసీ కారవ్యాన్‌లో పడుకుంటే తను మాత్రం సెట్‌లో నేలపై నిద్రించేవారు. ఆ సింప్లిసిటీ చూశాక నేనూ బయటే పడుకునేవాడిని’ అని గుర్తుచేసుకున్నారు.
News September 21, 2024
ప్రతి అంశంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్
BJPని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ అవినీతి వల్లే శివాజీ విగ్రహం కూలిందని, గురుగ్రామ్‌లో బైకర్ మృతికి కారణమైన కారుపై BJP స్టిక్కర్ ఉండడం వల్లే ఆ డ్రైవర్‌కు ఒక్కరోజులోనే బెయిల్ వచ్చిందని విమర్శించింది. పుణేలో పేవ్‌మెంట్‌కు గుంతపడి ట్రక్కు ఇరుక్కోవడంతో కొత్త ఎక్స్‌ప్రెస్ వే ద్వారా సెకెన్లలో పాతాళానికి చేరుకోవచ్చంటూ BJPని టార్గెట్ చేస్తోంది.
News September 21, 2024
Learning English: Synonyms
✒ Important: Necessary, Vital
✒ Interesting: Bright, Intelligent
✒ Keep: Hold, Maintain, Sustain
✒ Kill: Slay, Execute, Assassinate
✒ Lazy: Indolent, Slothful, Idle
✒ Little: Dinky, Puny, Diminutive
✒ Look: Inspect, Survey, Study
✒ Love: Like, Admire, Esteem
✒ Make: Design, Fabricate