News September 1, 2024
SAD: వరదల్లో కొట్టుకుపోయిన తండ్రీకూతురు

TG: MHBD జిల్లాలో విషాదం జరిగింది. ఖమ్మం (D) కారేపల్లి, గంగారాం తండాకు చెందిన నునావత్ మోతీలాల్, ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా.అశ్విని HYD వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు పురుషోత్తమయ్యగూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం లభ్యం కాగా మోతీలాల్ ఆచూకీ లభించలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కారులో బయలుదేరగా ఈ ఘటన జరిగింది.
Similar News
News February 16, 2025
ఫిబ్రవరి 16: చరిత్రలో ఈరోజు

1944: భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మరణం
1954: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ జననం
1956: భారత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా మరణం
1961: ఆర్థిక శాస్త్రవేత్త వాసిరెడ్డి శ్రీకృష్ణ మరణం
1964: పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ జననం
1985: పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు మరణం
2005: పర్యావరణ పరిరక్షణ కోసం క్యోటో ఒప్పందం అమలు
News February 16, 2025
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఫిబ్రవరి 16, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.41 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 16, 2025
శుభ ముహూర్తం (ఆదివారం, 16-02-2025)

తిథి: బహుళ చవితి రా.12.23 వరకు
నక్షత్రం: హస్త రా.2.59 వరకు
రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
దుర్ముహూర్తం: సా.4.25 నుంచి సా.5.13 వరకు
వర్జ్యం: ఉ.9.49 నుంచి ఉ.11.35 వరకు
అమృత ఘడియలు: రా.8.22 నుంచి రా.10.08 వరకు