News July 27, 2024
పాపం.. సంజూ శాంసన్
టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. తొలి టీ20లో సంజూకు చోటు దక్కలేదు. కనీసం టాపార్డర్ బ్యాటర్‌గానూ పరిగణనలోకి తీసుకోలేదు. జింబాబ్వే సిరీస్‌లో విఫలమైన పరాగ్‌కు అవకాశమిచ్చి శాంసన్‌ను పక్కనబెట్టడాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. శాంసన్ వరల్డ్‌లోనే మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 12, 2024
హరిహర వీరమల్లుపై క్రేజీ అప్‌డేట్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ గురించి అప్‌డేట్ వచ్చేసింది. త్వరలో ‘బ్యాటిల్ ఆఫ్ ధర్మ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని నిర్మాత ఎ.ఎమ్ రత్నం విజయదశమి సందర్భంగా వెల్లడించారు. ఆ పాటను పవన్ కళ్యాణ్ పాడారని తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.
News October 12, 2024
తప్పు ఎక్కడ జరిగింది?
తమిళనాడు కవరైపెట్టైలో ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. రైలు మెయిన్ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్ ఇవ్వగా, ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్ వైపు మళ్లించినట్లు దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ వెల్లడించారు. మెయిన్ లైన్‌పై వెళ్లాల్సిన రైలు ఎక్కడో తప్పు జరిగిన కారణంగా గూడ్స్ ఉన్న లైన్‌లోకి వెళ్లిందన్నారు. త్వరలోనే ఏం జరిగిందనేది ప్రకటిస్తామన్నారు.
News October 12, 2024
17న కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం
హరియాణాలో BJP ప్రభుత్వం Oct 17న కొలువుదీరనుంది. పంచకులలో జరిగే కార్యక్రమంలో నాయబ్ సింగ్ సైనీ మరోసారి CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు నూతన మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ, BJP పాలిత రాష్ట్రాల CMలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. కొత్త సభ్యులకు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం దక్కనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.