News November 26, 2024
ఏక్‌నాథ్ హైతో సేఫ్ హై.. CM పదవి కోసం పట్టువీడని శిండే వర్గం
మహారాష్ట్ర CM పదవి కోసం శివసేన శిండే వర్గం పట్టువీడటం లేదు. తాజాగా ఏక్‌నాథ్ శిండే ప్రచార బృందం వ్యూహాత్మక క్యాంపెయిన్‌ను జనంలోకి వదిలింది. ప్రధాని మోదీ నినదించిన ‘ఏక్ హైతో సేఫ్ హై’ను కాస్త ట్వీక్ చేసి ఏక్‌నాథ్ హైతో సేఫ్ హై అంటూ తన వాణిని బలంగా వినిపిస్తోంది. CM అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో శిండే వర్గం విశ్వప్రయత్నాల్లో ఉన్నట్టు ఈ ప్రచారం ద్వారా స్పష్టమవుతోంది.
Similar News
News December 10, 2024
2025 ఎలా ఉండబోతోంది.. వందల ఏళ్ల కిందటే చెప్పిన నోస్ట్రాడమస్!
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో 2025 ఎలా ఉండబోతుందో ఫ్రెంచ్ జ్యోతిషుడైన నోస్ట్రాడమస్ విశ్లేషించిన విషయాలు వైరలవుతున్నాయి. వచ్చే ఏడాది భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టవచ్చని, లేదా దగ్గరగా రావచ్చని అంచనా వేశారు. ‘దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది. బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవ్వడం వంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది’ అని జోస్యం చెప్పారు.
News December 10, 2024
ఈ ఏడాదిలో విమానాలకు 719 బాంబు బెదిరింపు కాల్స్
విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు గత ఐదేళ్లలో 809 ఫేక్ బాంబ్ థ్రెట్స్ వచ్చినట్లు పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది. ఇందులో 719 కేసులు 2024లోనే నమోదైనట్లు వెల్లడించింది. 2020లో నాలుగు, 2021లో రెండు, 2022లో 13, 2023లో 71 బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, చాలా సార్లు కావాలనే ఇలాంటి ఫేక్ కాల్స్, మెసేజ్‌లు చేసినట్లు నిందితులు ఒప్పుకోవడం గమనార్హం.
News December 10, 2024
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: బొత్స
AP: రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.20 వేలు ఎప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతులను దళారులు దోచుకు తింటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.