News November 17, 2024

సురక్షితమైన మూడు బ్యాంకులివే!

image

ఇండియాలో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులున్నాయి. అయితే, వాటిలో సురక్షితమైనవేవో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌లు దేశంలో సురక్షితమైనవి. ఈ మూడింటిని ముఖ్యమైన డొమెస్టిక్ బ్యాంకులుగా RBI గుర్తించింది. మరి మీకు ఏ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News December 14, 2024

GREAT: సైకిల్‌పైనే 41,400Kms వెళ్లిన రంజిత్

image

సైకిల్‌పై పక్కూరికి వెళ్లేందుకే కష్టమనుకునే వారున్న రోజుల్లో వరంగల్(TG)కి చెందిన రంజిత్ నాలుగేళ్లలో 41,400 KMS ప్రయాణించారు. తన తండ్రి 2020లో మరణించగా, ప్రపంచాన్ని చుట్టిరావాలనే ఆయన కలను తాను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యారు. స్తోమత లేకపోవడంతో సైకిల్‌పైనే ఇప్పటివరకు 13 దేశాల్లో పర్యటించారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన AUSలో ఉండగా BGT మ్యాచుకు వెళ్లారు.

News December 14, 2024

గబ్బా టెస్టులో సారా టెండూల్కర్ సందడి

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సందడి చేశారు. స్టాండ్స్‌లో నుంచి భారత ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా సారా సందడి చేసిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచులు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.

News December 14, 2024

అల్లు అర్జున్ ఇంటికి రానున్న ప్రభాస్!

image

జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.