News February 8, 2025
ఢిల్లీ కోటపై కాషాయ జెండా

27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కేంద్రంలో మూడు పర్యాయాలుగా బీజేపీ అధికారం చేపడుతున్నా హస్తిన పీఠం దక్కకపోవడం ఆ పార్టీకి వెలితిగా ఉండేది. కానీ ఇవాళ ఆ కోరిక తీరింది. అద్భుతమైన రాజకీయ వ్యూహాలతో ఆప్ కంచుకోటను బద్దలుకొట్టిన కమలదళం దేశ రాజధానిలో పాగా వేసింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాను సైతం ఓడించి కోలుకోలేని దెబ్బకొట్టింది.
Similar News
News March 16, 2025
ఒక్క హిట్ కోసం ఈ హీరోల ఎదురుచూపులు!

టాలీవుడ్‌లో ఇటు చిన్న కథలు, అటు భారీ సినిమాలు చక్కటి విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. కానీ మిడ్‌రేంజ్ హీరోలు మాత్రం ఆ మధ్యలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. విజయ్ దేవరకొండ, గోపీచంద్, నితిన్, వరుణ్ తేజ్, అక్కినేని అఖిల్.. వీళ్లంతా హిట్ చూసి చాలాకాలమే అయింది. అటు మరీ చిన్న సినిమాలు చేయలేక, ఇటు భారీ బడ్జెట్ ఎంచుకోలేక సతమతమవుతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని ఎదురుచూస్తున్నారు.
News March 16, 2025
నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కోనాయిచలం వద్ద రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి, డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
News March 16, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 82,580 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.