News April 11, 2024

ఐదేళ్ల కనిష్ఠానికి సాగర్ నీటిమట్టం

image

TG: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో 510.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుంటే మేలో తాగునీటిని అందించడం కష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఈ జలాశయంలో 132.86 టీఎంసీల నీరు ఉంది. అత్యవసర పరిస్థితుల్లో నీటిని 505 అడుగుల వరకు విడుదల చేయాలని కేఆర్ఎంబీ యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 25, 2025

బండి సంజయ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: బీఆర్ఎస్

image

TG: మాజీ సీఎం, BRS అధినేత KCRపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ చేసిన డబ్బునే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారని BRS తన ఫిర్యాదులో పేర్కొంది.

News March 25, 2025

పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

image

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

News March 25, 2025

BSNL యూజర్లకు అలర్ట్

image

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

error: Content is protected !!