News February 5, 2025
ప్రభాస్ సినిమాలో సాయిపల్లవి?

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో డార్లింగ్ ప్రేయసి పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఆ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News February 9, 2025
మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్లే…

మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా.. అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
News February 9, 2025
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఏఆర్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు తిరుపతిలోనే ఉండి విచారణను వేగవంతం చేశారు.
News February 9, 2025
చైతూని చూసి గర్విస్తున్నా: నాగార్జున

తన కొడుకు నాగచైతన్యను చూసి గర్విస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘తండేల్’ కేవలం సినిమా మాత్రమే కాదని, చైతూ డ్రీమ్, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్, బన్నీ వాస్, దర్శకుడు చందూ మొండేటికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ కుటుంబానికి మద్దతుగా ఉన్న అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.