News January 21, 2025

నేడు ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. మ.12 గంటలలోగా ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈనెల 16న ఆయన తన నివాసంలో కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు రెండు సర్జరీలు చేసినట్లు డాక్టర్లు ఇదివరకే ప్రకటించారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్‌‌ను ఆయన ఇంటికి తీసుకొచ్చి క్రైమ్‌సీన్ రీక్రియేషన్ చేశారు.

Similar News

News February 13, 2025

మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్

image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చిలో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల మిషన్‌ కోసం వెళ్లి సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె మార్చి మధ్యలో రానున్నట్లు NASA తెలిపింది. సునీతతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నట్లు పేర్కొంది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని వెల్లడించింది.

News February 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్షలకు వచ్చే సమయంలో హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని APPSC స్పష్టం చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లలో 89,900 మంది పరీక్ష రాయనున్నారు.

News February 13, 2025

కోహ్లీ ఏ జట్టుపై ఎన్ని రన్స్ చేశారంటే?

image

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా ఆస్ట్రేలియాపై 5393 పరుగులు (ఆల్ ఫార్మాట్స్) చేశారు. ఆ తర్వాత శ్రీలంక (4076), ఇంగ్లండ్ (4038), వెస్టిండీస్ (3850), సౌతాఫ్రికా (3306), న్యూజిలాండ్ (2915), బంగ్లాదేశ్ (1676), పాకిస్థాన్ (1170), ఆఫ్గానిస్థాన్ (347), జింబాబ్వే (305), నెదర్లాండ్స్ (125), ఐర్లాండ్ (88), హాంగ్ కాంగ్ (59), యూఏఈ (33), స్కాట్లాండ్‌పై 2 రన్స్ చేశారు.

error: Content is protected !!