News January 31, 2025

సైఫ్ కేసు: నేరం ఒకరిది.. సామాజిక శిక్ష మరొకరికి!

image

యెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే! యాక్టర్ సైఫ్‌ కేసులో ముంబై పోలీసుల సూచనతో ఛత్తీస్‌గఢ్ దుర్గ్ స్టేషన్లో ఆకాశ్ కనోజియాను RPF సస్పెక్ట్‌గా అదుపులోకి తీసుకుంది. షరీఫుల్ దొరికాక వదిలేసింది. ఇది అతడి జీవితాన్నే మార్చేసింది. అతడి ఫొటో వైరల్ కావడంతో ఉద్యోగం పోయింది. పెళ్లి చెడిపోయింది. కుటుంబానికి అప్రతిష్ఠ వచ్చింది. అసలు తన ఫొటో ఎందుకు వైరల్ చేశారంటూ ఆయన కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Similar News

News January 31, 2025

ఎంపీ బన్సూరి స్వరాజ్‌‌కు కృతజ్ఞతలు: ‘తండేల్’ నిర్మాత

image

ఎంపీ బన్సూరి స్వరాజ్‌‌కు ‘తండేల్’ సినిమా నిర్మాత బన్నీ వాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తల్లి, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేరును తమ సినిమాలో వాడుకునేందుకు అనుమతినిచ్చారని ట్వీట్ చేశారు. 2017, 2018లో పాకిస్థాన్ జైళ్లలో చిక్కుకున్న మత్స్యకారులను తిరిగి తీసుకురావడంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని, అప్పటి నిజ జీవిత సంఘటనలను తమ మూవీలో చూపించినట్లు వాసు పేర్కొన్నారు.

News January 31, 2025

నేటి నుంచి మోగనున్న పెళ్లిబాజాలు

image

మాఘమాసం ఆరంభం కావడంతో ఇవాళ్టి నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. శుభ ముహూర్తంలో మూడు ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 13, 14, 16, 20, 22, 23, మార్చి 2, 6, 7, 12, 14, 15, 16, ఏప్రిల్ 9, 10, 11, 12, 13, 16, 18, 20, 23, 29, 30, మే 1, 7, 8, 9, 10, 11, 14, 15, 16, 17, 18, 21, 22, 23, 28 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నట్లు పండితులు తెలిపారు.

News January 31, 2025

రేవంత్ నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం నాశనం: హరీశ్ రావు

image

TG: సీఎం రేవంత్ తన అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. మేడ్చల్ జిల్లాలో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ <>ఉరేసుకునే<<>> పరిస్థితి రావడం శోచనీయం అని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై 14 నెలల కాంగ్రెస్ పాలన పెను ప్రభావాన్ని చూపిందని, స్వర్గధామంగా ఉండే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు బిల్డర్లకు నరకకూపం అయ్యిందని ఆరోపించారు.