News January 31, 2025
సైఫ్ కేసు: నేరం ఒకరిది.. సామాజిక శిక్ష మరొకరికి!

యెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే! యాక్టర్ సైఫ్ కేసులో ముంబై పోలీసుల సూచనతో ఛత్తీస్‌గఢ్ దుర్గ్ స్టేషన్లో ఆకాశ్ కనోజియాను RPF సస్పెక్ట్‌గా అదుపులోకి తీసుకుంది. షరీఫుల్ దొరికాక వదిలేసింది. ఇది అతడి జీవితాన్నే మార్చేసింది. అతడి ఫొటో వైరల్ కావడంతో ఉద్యోగం పోయింది. పెళ్లి చెడిపోయింది. కుటుంబానికి అప్రతిష్ఠ వచ్చింది. అసలు తన ఫొటో ఎందుకు వైరల్ చేశారంటూ ఆయన కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Similar News
News February 19, 2025
సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.
News February 19, 2025
ఆ సంఘటన తర్వాత మారిపోయా: హీరోయిన్

తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.
News February 19, 2025
‘బుక్’ పాలిటిక్స్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు TDP జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ ‘రెడ్’ బుక్ మెయింటేన్ చేస్తున్నామని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల ‘పింక్’ బుక్ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల ‘కాషాయ’ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మీ కామెంట్?