News January 17, 2025

సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు

image

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.

Similar News

News February 9, 2025

రోహిత్‌ శర్మ రాణించాలని అభిమానుల పూజలు

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.

News February 8, 2025

ఢిల్లీ నుంచి గల్లీకి చేరిన కేజ్రీవాల్

image

నిన్నటివరకు మోదీకి ఎదురునిలిచే నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రస్తుతం మాత్రం ఆప్‌తో పాటు తానూ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పరిస్థితి తలకిందులుగా మారింది. పంజాబ్‌లో అధికారంతో పాటు పలురాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి జోరుమీదున్న ఆప్‌కు ఢిల్లీ ఓటమి కోలుకోలేని దెబ్బ. లిక్కర్ స్కాం,శీశ్‌మహాల్, యమున నది కలుషితం తదితర అంశాలతో పాటు సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత తదితర అంశాలు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి.

News February 8, 2025

‘అఖండ-2’లో విలన్‌గా క్రేజీ యాక్టర్?

image

సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించిన నటుడు ఆది పినిశెట్టి మరోసారి బోయపాటి శ్రీను మూవీలో విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’లో ప్రతినాయకుడి పాత్రలో ఆది కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ సినిమాలో ఆది విలనిజంకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

error: Content is protected !!