News December 2, 2024
సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట

YCP సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంలో ఊరట దక్కలేదు. తనపై నమోదైన FIRలు కొట్టేయాలని పిటిషన్ వేయగా, హైకోర్టు ముందే విజ్ఞప్తులు చెప్పుకోవాలని సుప్రీం పేర్కొంది. అటు, తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న భార్గవ పిటిషన్లపై NOV 29న AP హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 6కి విచారణ వాయిదా వేస్తూ, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Similar News
News March 27, 2026
నేడు రాములోరి కళ్యాణానికి సీఎం

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని రూ.351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో 11:30AM నుంచి 12:30PM వరకు తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
News March 27, 2026
2,300 కిలోల డ్రగ్స్ ఎలుకలు తినేశాయట!

గుజరాత్ పోలీస్ కస్టడీ నుంచి ఏకంగా 2,332 కిలోల డ్రగ్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. సీజ్ చేసిన స్టాక్‌లో ఇది 35% అని CAG రిపోర్ట్ వెల్లడించింది. దీనిపై హోం శాఖ వింత వివరణ ఇచ్చింది. సుమారు 144 కిలోల గంజాయి చోరీకి గురైందని తెలిపింది. మిగిలిన గంజాయి, నల్లమందును ఎలుకలు తినేశాయని లేదా తేమ వల్ల బరువు తగ్గి ఉండొచ్చని పేర్కొంది. అయితే ఈ ‘ఎలుకల థియరీ’పై కాగ్ అసహనం వ్యక్తం చేసింది.
News March 27, 2026
కురుల ఆరోగ్యాన్ని పెంచే తమలపాకు

తమలపాకులు కురుల ఆరోగ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురులను దృఢంగా చేసి చుండ్రును నియంత్రిస్తాయి. ☛ మందార పూలు, తమలపాకులు, కరివేపాకు, తులసి ఆకులను పేస్ట్ చేసి 2స్పూన్ల నూనె కలిపి తలకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ☛ తమలపాకు పేస్టుకు కాస్త కొబ్బరినూనె, ఆముదం కలిపి తలకు పెట్టుకొని అరగంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


