News December 2, 2024

సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో దక్కని ఊరట

image

YCP సోషల్ మీడియా మాజీ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీం‌లో ఊరట దక్కలేదు. తనపై నమోదైన FIRలు కొట్టేయాలని పిటిషన్ వేయగా, హైకోర్టు ముందే విజ్ఞప్తులు చెప్పుకోవాలని సుప్రీం‌ పేర్కొంది. అటు, తనపై రాష్ట్ర‌వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న భార్గవ పిటిషన్లపై NOV 29న AP హైకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్‌ 6కి విచారణ వాయిదా వేస్తూ, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Similar News

News February 17, 2025

‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.

News February 17, 2025

బీసీసీఐ షరతులతో ఇబ్బందిపడుతున్న కోహ్లీ!

image

బీసీసీఐ టీమ్ఇండియాకు పెట్టిన షరతులు కోహ్లీకి ఇబ్బందికరంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఫ్యామిలీ, వ్యక్తిగత సిబ్బందికి బోర్డ్‌ నో చెప్పింది. దీంతో కోహ్లీ తన చెఫ్‌ను వెంట తీసుకెళ్లలేకపోయారు. డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండే విరాట్‌కి అక్కడి ఫుడ్ తినటం ఇబ్బందిగా మారిందట. దీంతో మేనేజర్‌తో తనకు కావాల్సిన ఆహారాన్ని ఓ ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి తెప్పించుకొని తింటున్నారని సమాచారం.

News February 17, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: CM రేవంత్

image

TG: ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

error: Content is protected !!