News March 17, 2024
ASRTU స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా సజ్జనార్

TSRTC ఛైర్మన్ సజ్జనార్‌ను మరో పదవి వరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్టేకింగ్స్(ASRTU) స్టాండింగ్ కమిటీ నూతన ఛైర్మన్‌గా ఆయన ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ASRTU 54వ జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సజ్జనార్ ఆ పదవిలో ఏడాదిపాటు కొనసాగనున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా TSRTC చీఫ్ మెకానిక్ ఇంజినీర్ రఘునాథరావు ఎన్నికయ్యారు.
Similar News
News November 1, 2025
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘కల్కి’

ముంబై వేదికగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)-2025 వైభవంగా జరిగింది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా, ‘స్త్రీ-2’ బెస్ట్ మూవీలుగా నిలిచాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-2), బెస్ట్ యాక్టర్‌గా కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్‌గా కృతి సనన్, బెస్ట్ డైరెక్టర్‌గా కబీర్‌ఖాన్‌కు అవార్డులు దక్కాయి.
News November 1, 2025
OCT జీఎస్టీ వసూళ్లు ₹1.96L కోట్లు

ఈ ఏడాది అక్టోబర్‌లో ₹1.96L కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్(₹1.87L కోట్లు)తో పోలిస్తే 4.6 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. రిఫండ్ల తర్వాత నెట్ కలెక్షన్లు ₹1.69L కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇక 2024 ఏప్రిల్-అక్టోబర్ మధ్య ₹12.74L కోట్లు వసూలవ్వగా, ఈ ఏడాది అదే సమయంలో 9 శాతం వృద్ధితో ₹13.89L కోట్లు ఖజానాలో చేరినట్లు వివరించింది.
News November 1, 2025
తొక్కిసలాట ఘటనపై అధికారుల వివరణ

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. ఇవాళ ఆలయానికి 15వేల మంది వచ్చారని వెల్లడించారు. ఘటనాస్థలిలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో ఇద్దరు మృతిచెందినట్లు చెప్పారు. ఘటనలో 13 మందికి గాయాలయ్యాయని, వారికి పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.


