News August 12, 2024

‘అవయవదానం’ ప్రతిజ్ఞ చేసిన సజ్జనార్

image

రేపు అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం. ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్‌లో జరిగిన ‘Organ Donation Pledge Drive’లో TGSRTC ఎండీ సజ్జనార్ పాల్గొని అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రాణం పోయినా మరికొందరిని బతికించగలిగే మ‌హోత్త‌ర కార్యక్రమం ఇదని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతో మంది అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మీరూ ప్రతిజ్ఞ చేయాలనుకుంటే ‘<>జీవన్‌దాన్’<<>>లో రిజిస్టర్ అవ్వండి.

Similar News

News September 9, 2024

RISHABH PANT: 634 రోజుల తర్వాత రీఎంట్రీ

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ 634 రోజుల తర్వాత టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్టుకు పంత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోడ్డు ప్రమాదం తర్వాత టీ20, వన్డేల్లో ఆడినా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆయన ఇంకా ఆడలేదు. ఈ క్రమంలో బంగ్లా సిరీస్‌కు ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి కూడా పంత్ ఎంపిక లాంఛనమే. ఆసీస్‌పై అతడి మెరుగైన గణాంకాలే ఇందుకు నిదర్శనం.

News September 9, 2024

జో రూట్ ఖాతాలో మరో రికార్డు

image

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రూట్ (12,402) అవతరించారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుమార సంగక్కర (12,400) రికార్డును ఆయన అధిగమించారు. మరో 83 పరుగులు చేస్తే అలిస్టర్ కుక్ (12,472) రికార్డు కూడా రూట్ బద్దలుకొడతారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (15921) ఉన్నారు.

News September 9, 2024

నాటో పరిధిలో కుప్పకూలిన రష్యా డ్రోన్

image

రష్యాకు చెందిన ఓ సైనిక డ్రోన్ నాటో పరిధిలోని లాత్వియా దేశంలో తాజాగా కుప్పకూలింది. ఈ దేశాధ్యక్షుడు ఎడ్గర్స్ రింకెవిక్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. డ్రోన్ బెలారస్‌ మీదుగా తమ దేశంలో పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఉన్న లాత్వియా, తర్వాతి కాలంలో ప్రత్యేక దేశంగా మారి నాటో సభ్యదేశమైంది.