News March 19, 2024

రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమలలో మార్చి 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవంలో భాగంగా తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులను కనువిందు చేయనున్నారు.

Similar News

News January 7, 2025

Stock Markets: కొంత తేరుకున్నాయ్!

image

స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి నష్టాల నుంచి కొంత తేరుకున్నాయి. నిఫ్టీ 23,683 (+70), సెన్సెక్స్ 78,069 (+101) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్ 400, నిఫ్టీ 140 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు తగ్గడం పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. IT, MEDIA, AUTO షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.

News January 7, 2025

ప్రపంచాన్ని వణికించిన వైరస్‌లు ఇవే!

image

కరోనాను మరవకముందే hMP వైరస్ భారత్‌ను తాకి కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు ముందే వివిధ కాలాల్లో ప్రపంచాన్ని కొన్ని వైరస్‌లు వణికించగా, కొన్ని ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి.
1. రోటా వైరస్, 2. స్మాల్ పాక్స్, 3. మీజిల్స్(తట్టు), 4. డెంగ్యూ, 5. ఎల్లో ఫీవర్, 6. ఫ్లూ, 7. రేబిస్, 8.హెపటైటిస్-బీ&సీ, 9. ఎబోలా, 10. హెచ్‌ఐవీ.

News January 7, 2025

ఈ కోడి గుడ్డు ధర రూ.700

image

AP: సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. అయితే పందెం కోడి గుడ్డుకు రూ.400-700 వరకు డిమాండ్ ఉంటోంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో చాలా మందికి ఇదొక కుటీర పరిశ్రమగా మారింది.