News December 27, 2024
నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!

MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్‌తో మెయిల్ మార్చాలని బ్యాంక్‌కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్‌కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్‌తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News October 20, 2025
దీపావళి: ఇవాళ ఏం చేయాలి?

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉంటే రాత్రి వేళలో <<18052455>>జాగ్రత్తలు<<>> పాటిస్తూ టపాసులు కాల్చాలి.
News October 20, 2025
దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్‌లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.
News October 20, 2025
ఇవాళ భారీ వర్షాలు

ఇవాళ ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఉ.8.30 గంటలలోపు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.