News May 1, 2024

వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంచుతాం: లోకేశ్

image

AP: వాలంటీర్ల వ్యవస్థపై నెల్లూరు యువగళం సభలో టీడీపీ నేత, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలనేదే తమ లక్ష్యమన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News March 27, 2026

IPL షెడ్యూల్‌లో ఈ మార్పు గమనించారా?

image

గతంలో ఒక జట్టు తమ గ్రూపులోని మిగతా టీమ్స్‌తో 2 సార్లు తలపడింది. వేరే గ్రూప్‌లోని ఒక జట్టుతో రెండుసార్లు, మిగతావాటితో ఒకసారి ఆడింది. కానీ ఈసారి సొంత గ్రూప్‌లోని జట్లతో ఒకసారి, మరో గ్రూప్‌లోని జట్లతో రెండేసి సార్లు ఆడనున్నాయి. దీంతో MI-CSK రెండేసి సార్లు ఢీకొననున్నాయి. RCBతోనూ MI 2 మ్యాచులు ఆడనుంది. ఇది అభిమానులకు కనులవిందే.
గ్రూప్-A: CSK, KKR, RR, RCB, PBKS
గ్రూప్-B: MI, SRH, GT, DC, LSG

News March 27, 2026

సమ్మర్‌లో చెమటకాయలు రాకుండా ఉండాలంటే?

image

వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. రోజుకు 2సార్లు స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టే మెడ, చంకలు తదితర చోట్ల యాంటీ ఫంగల్/సాధారణ పౌడర్‌ను చల్లుకోవాలి. 12pm-3pm మధ్య ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. శరీరం చల్లగా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ముఖ్యంగా వేసవిలో పసిపిల్లల చర్మం పట్ల తల్లులు శ్రద్ధ తీసుకోవాలి. వారికి సరిపడా నీళ్లు అందుతున్నాయో లేదో చూసుకోవాలి.