News September 27, 2024

రజనీకాంత్ మూవీ ఈవెంట్‌కు పిలవకపోయినా వచ్చిన సల్మాన్!

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అభిమాని అనే విషయం మీకు తెలుసా? రోబో 2.0 సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ జరుగుతుండగా సల్మాన్‌ను ఆహ్వానించనప్పటికీ అక్కడికి చేరుకొని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వేదికపైకి వచ్చి రజనీకి హగ్ ఇచ్చి బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని కొనియాడారు. సల్మాన్ ఖాన్ ఓకే అంటే వెంటనే ఆయనతో సినిమా తీస్తా అని సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరలయ్యాయి.

Similar News

News October 5, 2024

బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకు?

image

US NCBI ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11% గుండెపోటు మరణాలు బాత్రూమ్‌లోనే జరుగుతున్నాయి. స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. మలబద్ధకం ఉన్న వారు ముక్కినప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. అప్పుడు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు.

News October 5, 2024

వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్

image

TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.

News October 5, 2024

పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM

image

TG: మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని, రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు BRS, BJPలు సూచనలు చేయాలని కోరారు.