News December 5, 2024
బాబా సిద్ధిఖీ కంటే ముందే సల్మాన్‌పై టార్గెట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733378975670_695-normal-WIFI.webp)
మహారాష్ట్రలో NCP నేత బాబా సిద్ధిఖీ కంటే ముందు సల్మాన్ ఖాన్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే పటిష్ఠమైన సెక్యూరిటీ వల్ల వారి ప్రణాళిక విఫలమైందని పేర్కొన్నాయి. దీంతో సిద్ధిఖీపై ఫోకస్ చేసినట్లు చెప్పాయి. అక్టోబర్ 12న జరిగిన దాడిలో బాబా చనిపోగా, ఆయన కుమారుడు జీషన్ తప్పించుకున్నారు.
Similar News
News January 26, 2025
ఒత్తిడి వల్లే పరుగులు చేయలేకపోతున్నా: గిల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737875526446_893-normal-WIFI.webp)
రెడ్ బాల్ క్రికెట్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని తనపై తాను ఒత్తిడి పెట్టుకుంటున్నట్లు శుభ్‌మన్ గిల్ తెలిపారు. దాని వల్లే కొన్నిసార్లు ఏకాగ్రతను కోల్పోయి ఔట్ అవుతున్నట్లు చెప్పారు. కర్ణాటకVSపంజాబ్ రంజీ మ్యాచులో సెంచరీ చేసిన గిల్, ఇటీవల జరిగిన BGTలో విఫలమైన సంగతి తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌లలో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు చేశారు. దీంతో అతడిపై విమర్శలొచ్చాయి.
News January 26, 2025
వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735197064067_367-normal-WIFI.webp)
TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో మాట్లాడుతూ వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. VCలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. UGC ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.
News January 26, 2025
BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737881414988_893-normal-WIFI.webp)
TG: అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని CM రేవంత్ ప్రకటించారు. HYDలోని డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువే ఉంటాయని, ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదన్నారు. ఆయా వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్‌ను రేవంత్ ఆదేశించారు.