News April 30, 2024

సాల్ట్ అరుదైన రికార్డు

image

KKR ప్లేయర్ ఫిల్ సాల్ట్ అరుదైన రికార్డు సాధించారు. ఒక ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో అత్యధిక పరుగులు(344) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లోనే సాల్ట్ 344 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గంగూలీ(331), రసెల్(311), క్రిస్ లిన్(303) ఉన్నారు.

Similar News

News March 19, 2026

KNR: నాయబ్ తహశీల్దార్లకు పదోన్నతులు.. బదిలీలు

image

KNR ఉమ్మడి జిల్లాలో 14 మంది నాయబ్ తహశీల్దార్లు పదోన్నతితో బదిలీ అయ్యారు. JGTL నుంచి ఖాదీర్ (నిర్మల్), వరప్రసాద్ (ఆదిలాబాద్), కిరణ్, విష్ణు (NZB), ముక్తార్ పాషా (JGTL), శ్రీనివాస్ (ఆదిలాబాద్), KNR నుంచి నిజాముద్దీన్ (ఆసిఫాబాద్), వసంతరావు, స్వరూపరాణి (BPLPY), అజ్రత్ (NZB), వైశాలి (సిరిసిల్ల), రాజన్న సిరిసిల్ల నుంచి మారుతిరెడ్డి (సిరిసిల్ల), దివ్యజ్యోతి (NZB)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News March 19, 2026

కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ

image

తెలుగు ప్రజలకు PM మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ కొత్త శక్తికి, ఆరంభాలకు ప్రతీక అని గుర్తుచేశారు. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని AP CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘షడ్రుచులతో జీవన తత్వాన్ని ఆవిష్కరించే ఉషస్సు ఉగాది’ అంటూ TG CM రేవంత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం ప్రజలకు విషెస్ చెప్పారు.

News March 19, 2026

IPL పేరుపై వివాదం.. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే?

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పేరును BCCI ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను కేరళ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. IPL అధికారిక నేషనల్ టోర్నమెంట్ కాదని, అందువల్ల ‘ఇండియన్’ పదాన్ని వాడొద్దని పిటిషనర్ అషిక్ కరోత్ వాదించారు. కొన్నేళ్లుగా IPL జరుగుతున్నప్పటికీ ‘ఇండియన్’ పదం గురించి పిటిషనర్ ఆలస్యంగా గ్రహించారని, ఇది కోర్టు పరిధిలోకి రాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.