News April 30, 2024
సాల్ట్ అరుదైన రికార్డు
KKR ప్లేయర్ ఫిల్ సాల్ట్ అరుదైన రికార్డు సాధించారు. ఒక ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో అత్యధిక పరుగులు(344) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లోనే సాల్ట్ 344 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గంగూలీ(331), రసెల్(311), క్రిస్ లిన్(303) ఉన్నారు.
Similar News
News November 10, 2024
కార్తీక మాసం ఎఫెక్ట్.. తగ్గుతున్న చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కార్తీక మాసం కారణంగా భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండటంతో వ్యాపారులు రేట్లను తగ్గిస్తున్నారు. రెండు వారాల కింద కిలో చికెన్(స్కిన్ లెస్) రూ.270-300 ఉండగా, ప్రస్తుతం చాలా పట్టణాల్లో రూ.180-210 పలుకుతోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో యథాతథంగా రేట్లు ఉన్నాయి. కాగా ఈ నెలలో మరింత తగ్గి, డిసెంబర్ నుంచి రేట్లు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు.
News November 10, 2024
ఆ బోర్డు నాలుగు అక్షరాల క్రూరత్వం: కేంద్రమంత్రి
వక్ఫ్ బోర్డుపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అది ఒక నాలుగు ఆంగ్ల అక్షరాల ‘క్రూరత్వం” అని అన్నారు. కేరళలోని మునంబామ్‌లో క్రిస్టియన్లకు చెందిన 400 ఎకరాలు తమకు చెందుతాయని వక్ఫ్ బోర్డు అనడాన్ని తప్పుబట్టారు. త్వరలో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మండిపడింది. ప్రజలను విభజించి పాలించే ప్రకటనలు మానుకోవాలంది.
News November 10, 2024
అంగన్వాడీలను GOVT ఉద్యోగులుగా పరిగణించాలి.. గుజరాత్ హైకోర్టు
అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. నాలుగో తరగతి కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ₹15K ఇస్తుంటే అంగన్వాడీలకు ₹5-10K గౌరవ వేతనమే ఇస్తున్నారని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వారిని GOVTసర్వీసులోకి తీసుకుని పే స్కేల్ గురించి పేర్కొనాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. ఇది అమలైతే దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది.