News February 2, 2025
ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..?

దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్న సమంత ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్‌తో కలిసి సందడి చేశారు. ఈక్రమంలో ఆయన చేతిని సామ్ పట్టుకున్న ఫొటోలు బయటికొచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు.
Similar News
News February 19, 2025
నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

TG: నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. దాదాపు 120 ఎకరాల్లో మంటలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. నాగార్జునపేట తండా, జమ్మనకోట తండా, మూలతండా వరకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రధాన డ్యామ్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
News February 19, 2025
సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్

AP: ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్‌పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.
News February 19, 2025
కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.