News October 3, 2024

సమంత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం: డైరెక్టర్

image

మంత్రి కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ‘ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. నేను రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. 365 రోజులూ సమంతను దగ్గరుండి చూశా. ఒక అభిమానిగా చెప్తున్నా ఆమె తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం. ఆమె ఆర్టిస్ట్‌గా కాదు.. ఇంట్లో అక్కలా అనిపించేవారు. సురేఖ గారు మాట్లాడింది తప్పు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 13, 2026

జనవరి 13: చరిత్రలో ఈరోజు

image

✯1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
✯1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
✯1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
✯1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
✯1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
✯2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం

News January 13, 2026

ముగ్గురు ఇండియన్లను రిలీజ్ చేసిన అమెరికా!

image

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్‌లో ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. ఇవాళ వారిని అధికారులు రిలీజ్ చేశారు. ముగ్గురి క్షేమ సమాచారం కోసం భారత అధికారులు USతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. భారత్ ఒత్తిడి నేపథ్యంలో వారిని విడుదల చేశారు. నార్త్ అట్లాంటిక్‌లో రష్యా జెండాతో వెళ్తున్న క్రూడాయిల్ ట్యాంకర్‌ను ఈనెల 7న US స్వాధీనం చేసుకుంది. అందులోని 28 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుంది.

News January 13, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.