News December 9, 2024
అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ: మంత్రి
TG: రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఒకే ఫుడ్ మెనూ అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాలపై సమీక్షించిన ఆయన, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్కూళ్లలో సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు వెంటనే వైద్యం అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, ఆహారం నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News January 26, 2025
BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం
TG: అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని CM రేవంత్ ప్రకటించారు. HYDలోని డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువే ఉంటాయని, ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదన్నారు. ఆయా వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్‌ను రేవంత్ ఆదేశించారు.
News January 26, 2025
రోజా.. ఐదేళ్లు రాష్ట్రానికి మీరేం చేశారు?: మంత్రి దుర్గేశ్
AP: Dy CM పవన్ కళ్యాణ్‌ను CM చంద్రబాబు దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి రోజాపై మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని ఎవరూ దావోస్ తీసుకెళ్లరని అన్నారు. ‘పవన్ గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఆమె ఏం చేశారు? రిషికొండపై జగన్ భవనాలు కడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాని వల్ల పర్యాటక శాఖ నష్టపోయింది’ అని విమర్శించారు.
News January 26, 2025
పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు నాలుగైనా ఇవ్వాలి కదా?: రేవంత్
TG: ‘పద్మ’ అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. ‘పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి తక్కువతో నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేది. తొందర్లోనే దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నా. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేస్తాం’ అని వెల్లడించారు.