News July 8, 2024

నేటి నుంచి ఉచితంగా ఇసుక.. ఇలా బుక్ చేసుకోండి!

image

AP: నేటి నుంచి 20 జిల్లాల్లోని 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుక డిపోకు వెళ్లి లారీ, ట్రాక్టర్, మినీ ఆటోల్లో తీసుకెళ్లొచ్చు. ఇసుక తవ్వినందుకు, లోడ్ చేసినందుకు, డిపోల వరకు తరలించినందుకు లేబర్, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సగటున రోజుకు ఒక వినియోగదారుడికి 20 టన్నులే పంపిణీ చేస్తారు. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News December 11, 2025

దయనీయ స్థితిలో పావలా శ్యామల.. ఆత్మహత్యకు యత్నిస్తూ!

image

ప్రముఖ నటి పావలా శ్యామల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆదుకునేవారే లేకపోవడంతో ఆమె జీవనం అగమ్యగోచరంగా మారింది. దీంతో మంచానికే పరిమితమైన తల్లీకూతుళ్లను హోమ్ నిర్వాహకులు బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. రోడ్డుపై దయనీయస్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీరిని పోలీసులు గుర్తించి ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. దీనిపై సినీ పెద్దలు ఎవరూ స్పందించలేదు.

News December 11, 2025

‘అలాంటి వరి రకాల సాగును ప్రోత్సహించాలి’

image

ప్రజలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే వరి రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా ఎగుమతికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. సుబాబుల్ రైతులకు మంచి ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ, ఇతర ఉద్యానపంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.

News December 11, 2025

తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేటు!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 110 తగ్గి రూ.1,30,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.100 పతనమై రూ.1,19,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,09,000గా ఉంది. సిల్వర్ రేటు నాలుగు రోజుల్లోనే రూ.13,100 పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.