News February 2, 2025
సందీప్ వంగా పోస్ట్.. ఈ స్టిల్ ఏ సినిమాలోనిది?

తాజాగా సందీప్ రెడ్డి వంగా తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన గదిలో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఇందులో చిరంజీవి ఉన్న ఫొటో చర్చకు కారణమైంది. ఇది ఏ సినిమాలోని స్టిల్ అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. (HINT: ఈ సినిమాలో హీరోయిన్ సుహాసిని, దర్శకుడు భారతీరాజా)
Similar News
News December 4, 2025
జగిత్యాల: గ్రామపంచాయతీలను శాసిస్తున్న VDCలు..!

గ్రామపంచాయతీలను విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు శాసిస్తున్నాయి. గ్రామాల్లో సర్పంచ్ల ఏకగ్రీవాలకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇటీవల మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామం ఏకగ్రీవం కోసం రూ.28.60లక్షలకు వేలంపాట పాడిన ఘటన వివాదాస్పదమైంది. మరోవైపు VDCలే సర్పంచ్ అభ్యర్థిని ఎంచుకొని నామినేషన్లు దాఖలు చేయిస్తూ మద్దతు ప్రకటిస్తున్నాయి. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో వీటి ప్రభావం అధికంగా కన్పిస్తోంది.
News December 4, 2025
OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.
News December 4, 2025
థైరాయిడ్ ట్యూమర్స్ గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.


