News February 2, 2025
సందీప్ వంగా పోస్ట్.. ఈ స్టిల్ ఏ సినిమాలోనిది?

తాజాగా సందీప్ రెడ్డి వంగా తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన గదిలో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఇందులో చిరంజీవి ఉన్న ఫొటో చర్చకు కారణమైంది. ఇది ఏ సినిమాలోని స్టిల్ అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. (HINT: ఈ సినిమాలో హీరోయిన్ సుహాసిని, దర్శకుడు భారతీరాజా)
Similar News
News February 15, 2025
గురుదక్షిణగా నాకు ప్రియురాలుగా ఉండు.. టీచర్ ఒత్తిడి

బిహార్ కిసాన్‌గంజ్(D)లో వికాస్ అనే టీచర్ 12వ తరగతి విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడు. ఏకలవ్యుడు గురువుకు బొటన వేలును కోసి ఇచ్చినట్లుగా తనకు గురుదక్షిణగా ప్రియురాలిగా ఉండాలని కోరాడు. బాలిక మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె పేరెంట్స్, గ్రామస్థులు స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
News February 15, 2025
ప్రేమలో పడ్డారా? ఇలా తెలుసుకోండి!

మొబైల్‌లో చాట్ చేస్తూ నవ్వుకుంటున్నామంటే చాలు వీడు ప్రేమలో ఉన్నాడు అని మన పెద్దవాళ్లు డిసైడ్ చేసేస్తుంటారు. మీరు మీమ్స్ చూసి నవ్వుకుంటున్నారన్న విషయం వారికి తెలియదు. కానీ, ప్రేమలో పడినవారి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని BBC ఓ కథనంలో పేర్కొంది. బుగ్గలు ఎరుపెక్కితే, గుండె వేగంగా కొట్టుకుంటే, చేతులు జిగురులా అతుక్కుంటే.. అవి ప్రేమలో పడ్డారనడానికి సంకేతం అని పేర్కొంది.
News February 14, 2025
స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.