News December 9, 2024

ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.

Similar News

News November 29, 2025

కామారెడ్డి: సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు

image

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లాలో రాజకీయ పార్టీల్లో సర్పంచి స్థానాలకు పోటీ చేసేందుకు తీవ్ర పోటీ నెలకొంది. ఆశావాహులు టికెట్ కోసం మొండి పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. సమావేశాలు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. టికెట్ దక్కని ఆశావాహులకు నచ్చజెప్పేందుకు, తగిన గుర్తింపు ఇస్తామని నాయకత్వం హామీ ఇస్తోంది.

News November 29, 2025

TODAY HEADLINES

image

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత

News November 29, 2025

మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

image

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.