News November 13, 2024

సంజూ మళ్లీ డకౌట్

image

సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ రెండో బంతికే అతడిని జాన్సెన్ క్లీన్ బౌల్డ్ చేశారు. తొలి మ్యాచ్‌లో సెంచరీతో విరుచుకుపడ్డ సంజూ రెండో టీ20లో డకౌట్ అయ్యారు. తాజాగా ఈ మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

Similar News

News February 1, 2026

భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్‌కు ప్రత్యేక నిధులు దక్కేనా?

image

60ఏళ్లుగా ఎదురుచూస్తున్న భద్రాచలం రోడ్–కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్రబడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు లభిస్తాయా? లేదా ? అనేది ఆసక్తి నెలకొంది. 118.9 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్ట్‌కు ₹1,695.71 కోట్ల అంచనాతో DPR ఇప్పటికే ఖరారైంది. కేంద్రం చొరవ చూపి నిధులు కేటాయిస్తే రెండు రాష్ట్రాల పరిధిలో సరుకు, ప్రజా రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. అలాగే విశాఖ-HYD మధ్య దూరం దాదాపు 100 కి.మీ.తగ్గుతుంది.

News February 1, 2026

మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

image

TG: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ నిమ్స్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు. JAN 23న ఇద్దరు స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సౌమ్యను కారుతో ఢీకొట్టారు. రివర్స్ తీస్తూ మరోసారి కారును ఆమెపై నుంచి తీసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఒక కిడ్నీ తొలగించారు.

News February 1, 2026

నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నేటి నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 10 వరకు జరిగే ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,274 సెంటర్లను, ఒకేషనల్ సబ్జెక్టుల కోసం 624 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. గత ఏడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని తొలగించారు. దీంతో ఏ కాలేజీ విద్యార్థులు అదే కళాశాలలో ఎగ్జామ్ రాయొచ్చు.