News November 13, 2024
సంజూ మళ్లీ డకౌట్
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ రెండో బంతికే అతడిని జాన్సెన్ క్లీన్ బౌల్డ్ చేశారు. తొలి మ్యాచ్లో సెంచరీతో విరుచుకుపడ్డ సంజూ రెండో టీ20లో డకౌట్ అయ్యారు. తాజాగా ఈ మ్యాచ్లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
Similar News
News December 8, 2024
పసుపు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం!
భారతీయ వంటల్లో పసుపు ఓ భాగం. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగని అధికంగా పసుపు వాడితే ఆరోగ్య సమస్యలొస్తాయని నిపుణులు అంటున్నారు. డయేరియా, గ్యాస్ సమస్యలతో పాటు పసుపులో ఉన్న వేడి కలిగించే లక్షణం అలర్జీకి కారణమవుతుందట. గర్భిణీలు పసుపు తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించాలని, మోతాదు మించితే గర్భాశయ కండరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
News December 8, 2024
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది: కిషన్ రెడ్డి
TG: KCR, రేవంత్ కవల పిల్లలని, ఆ పార్టీల DNA ఒకటే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని తెలిపారు. పదేళ్లలో KCR, ఏడాది గడిచినా రేవంత్ ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదన్నారు. హామీలను కాంగ్రెస్ మరిచిపోయిందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కి 8 సీట్లు, BJPకి 8 సీట్లు వచ్చాయని, రాష్ట్రంలో BJP బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారని సరూర్నగర్ సభలో చెప్పారు.
News December 8, 2024
YCP మళ్లీ అధికారంలోకి రావడం కల: మంత్రి గొట్టిపాటి
AP: సీఎం చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నేతల బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకునేందుకు కాదని వైసీపీ గుర్తించాలని చెప్పారు. అక్రమ కేసులతో చంద్రబాబును జైలుకు పంపినందుకే ప్రజలు ఛీకొట్టారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడమనేది కల అని మంత్రి వ్యాఖ్యానించారు.