News October 25, 2024
IPL తొలి రిటెన్షన్ సంజూ శాంసన్?

ఐపీఎల్ 2025 కోసం సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్నట్లు క్రిక్‌ట్రాకర్ తెలిపింది. సంజూకు రిటెన్షన్ కింద రూ.18 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మిగతా ఆటగాళ్ల రిటెన్షన్లపై తీవ్ర కసరత్తు చేస్తోంది. యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, యుజ్వేంద్ర చాహల్‌ను అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు టాక్. ఇక జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.
News July 11, 2025
చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.