News October 30, 2024

సంజూ శాంసన్ బ్యాటింగ్ అద్భుతం: రికీ పాంటింగ్

image

భారత ప్లేయర్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. అతడి బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. ‘భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, గిల్, పంత్, విరాట్.. వీళ్లందరి ఆటా నాకు చాలా ఇష్టం. కానీ సంజూ శాంసన్ అని మరో ఆటగాడున్నాడు. మీరంతా అతడి ఆటను ఎంత ఆస్వాదిస్తారో నాకు తెలీదు కానీ.. నేను మాత్రం టీ20ల్లో సంజూ బ్యాటింగ్ చూడటాన్ని చాలా ఇష్టపడతాను’ అని తెలిపారు.

Similar News

News November 22, 2025

నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా వెడ్మ బొజ్జు

image

నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగానూ గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు.

సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి

image

AP: సత్యసాయి బాబా సిద్ధాంతాలు, సూత్రాలే నిజమైన విద్య అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంస్థలో పట్టభద్రులైన వారికి పట్టాలు అందజేసి మాట్లాడారు. ‘ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం. ఆధునిక విధానాలతో పాటు సంప్రదాయాలను పాటించాలి. డ్రగ్స్ ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. నో టూ డ్రగ్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి’ అని ఆయన సూచించారు.