News October 30, 2024

సంజూ శాంసన్ బ్యాటింగ్ అద్భుతం: రికీ పాంటింగ్

image

భారత ప్లేయర్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. అతడి బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. ‘భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, గిల్, పంత్, విరాట్.. వీళ్లందరి ఆటా నాకు చాలా ఇష్టం. కానీ సంజూ శాంసన్ అని మరో ఆటగాడున్నాడు. మీరంతా అతడి ఆటను ఎంత ఆస్వాదిస్తారో నాకు తెలీదు కానీ.. నేను మాత్రం టీ20ల్లో సంజూ బ్యాటింగ్ చూడటాన్ని చాలా ఇష్టపడతాను’ అని తెలిపారు.

Similar News

News November 15, 2024

బంగ్లా రాజ్యాంగానికి కీలక మార్పులు!

image

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజంను తొలగించాలని బంగ్లా AG అసదుజ్జమాన్ ప్రతిపాదించారు. అవామీ లీగ్ ప్రభుత్వం చేసిన 15వ రాజ్యాంగ సవరణ లౌకిక‌వాదాన్ని ప్రాథ‌మిక సూత్రంగా పున‌రుద్ధరించడం సహా షేక్ ముజీబుర్ రెహ్మాన్‌ను జాతిపితగా గుర్తిస్తోంది. దీన్ని స‌వాల్ చేస్తూ కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. కేసు విచారణ సందర్భంగా 15వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమని తమ ప్రభుత్వం ప్రకటించాలనుకుంటోందని AG అన్నారు.

News November 15, 2024

ఫిట్‌మెంట్ ఫ్యాక్ట‌ర్ 2.86!

image

8వ వేత‌న స‌వ‌ర‌ణ సంఘంపై కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు గంపెడాశ‌ల‌తో ఉన్నారు. జీతాలు, పెన్షన్ల సవరణ కోసం కనీసం 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌‌పై ఉద్యోగులు ఆశాభావంగా ఉన్న‌ట్టు NC-JCM సెక్రటరీ(స్టాఫ్ సైడ్) శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు. ఈ లెక్క‌న ప్రభుత్వ ఉద్యోగి కనీస వేత‌నం ప్రస్తుతం ఉన్న రూ.18 వేల నుంచి రూ.51,480కి పెరగనుంది. అదే విధంగా పెన్షన్లు కూడా రూ.9 వేల నుంచి రూ.25,740కి పెరుగుతాయని అంచనా.

News November 15, 2024

సర్ఫరాజ్ ఖాన్‌కు గాయం?

image

టీమ్ ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో ఆయన మోచేతికి గాయమైనట్లు సమాచారం. వెంటనే ఆయన నొప్పితో మైదానం వీడినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై జట్టు మేనేజ్‌మెంట్ స్పందించాల్సి ఉంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జట్టు కూర్పుపై కూడా ప్రభావం చూపిస్తుంది.