News May 11, 2024

సంక్రాంతి సందడి తెచ్చిన ఓట్ల పండుగ

image

తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన హైదరాబాద్-విజయవాడ హైవే సంక్రాంతి రద్దీని తలపిస్తోంది. తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంతూళ్లకు భారీ సంఖ్యలో బయల్దేరుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, బస్సులు బారులు తీరాయి. మరోవైపు విజయవాడలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. మరి మీరూ ఓటేసేందుకు వెళ్తున్నారా? కామెంట్ చేయండి.

Similar News

News December 24, 2025

నల్ల వెల్లుల్లి గురించి తెలుసా.. బోలెడు ప్రయోజనాలు

image

వెల్లుల్లి అంటే తెల్లటి రెబ్బలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నల్ల వెల్లుల్లి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తెల్ల వెల్లుల్లిని ఫర్మంటేషన్ ప్రక్రియ ద్వారా నల్లగా తయారు చేస్తారు. ఇది ఘాటు వాసన లేకుండా కొంచెం తీపిగా ఉంటుంది. నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు ఒకటి రెండు రెబ్బలు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

News December 24, 2025

కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల(గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా యానిమల్(రూ.917 కోట్లు)ను బీట్ చేసి 9వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి రికార్డులు బ్రేకవడం గ్యారంటీ.

News December 24, 2025

కన్నప్రేమ నేర్పిన నాయకత్వం: సత్య నాదెళ్ల విజయ రహస్యం

image

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నాయకత్వ శైలి మారడానికి ఆయన పిల్లలే ప్రధాన కారణం. పుట్టుకతోనే ప్రత్యేక అవసరాలున్న తన పిల్లలను చూశాక లోకాన్ని చూసే కోణం మారిందన్నారు ఆయన ఓ సందర్భంలో. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం నాయకుడికి ఉండాలని గ్రహించారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి సాంకేతికత అందాలనే లక్ష్యంతో పనిచేశారు. తన పిల్లల వల్ల కలిగిన ఈ అనుభవాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి.