News May 11, 2024
సంక్రాంతి సందడి తెచ్చిన ఓట్ల పండుగ

తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన హైదరాబాద్-విజయవాడ హైవే సంక్రాంతి రద్దీని తలపిస్తోంది. తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంతూళ్లకు భారీ సంఖ్యలో బయల్దేరుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, బస్సులు బారులు తీరాయి. మరోవైపు విజయవాడలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. మరి మీరూ ఓటేసేందుకు వెళ్తున్నారా? కామెంట్ చేయండి.
Similar News
News February 10, 2025
కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే

మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్‌రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.
News February 10, 2025
రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ కన్నీళ్లే: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద RMP, PMPల ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మడం లేదని రాహుల్ గాంధీతో బాండ్ పేపర్లు రాయించారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ అమలు కావడం లేదు. 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్ సాధించిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.