News January 10, 2025

‘సంక్రాంతి’ ప్రయాణికులపై ఛార్జీల భారం

image

TG: ‘సంక్రాంతికి’ సొంతూళ్లకు వెళ్లే ఆంధ్ర, తెలంగాణ ప్రయాణికులపై TGSRTC ఛార్జీల భారం మోపింది. పండగ సందర్భంగా నడపనున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో ఎప్పటిలాగే సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. అటు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ యథావిధిగా నడుస్తుందని తెలిపింది.

Similar News

News April 9, 2026

ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం.. ట్రంప్ బిగ్ వార్నింగ్

image

ఇరాన్ అణ్వాయుధాల తయారీ వదలడంతో పాటు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం ప్రారంభిస్తామని, గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీస్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరే వరకు అక్కడే ఉంటారని తెలిపారు.

News April 9, 2026

16న మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ: మోదీ

image

డీలిమిటేషన్‌కు అనుగుణంగా మహిళా రిజర్వేషన్(33%) సవరణ బిల్లుపై ఈ నెల 16న పార్లమెంటులో చర్చించి, ఆమోదించనున్నట్లు PM మోదీ ప్రకటించారు. ‘ఇది శాసనపరమైన ప్రక్రియ మాత్రమే కాదు. కోట్లాది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబం. 2029 LS ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్‌తో నిర్వహించడం అత్యవసరం’ అని పేర్కొన్నారు. LS స్థానాలను 543 నుంచి 816కి పెంచి, వాటిలో 273 మహిళలకు కేటాయించడమే ఈ బిల్లు ఉద్దేశం.

News April 9, 2026

భారీగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24, 22 క్యారెట్ల పసిడి ధరలు భారీగా పడిపోయాయి. 24క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేటు రూ.2,340 తగ్గి రూ.1,51,480కు చేరింది. 22క్యారెట్ల 10గ్రా.ల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,38,850 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,65,100గా ఉంది.