News November 12, 2024

జనవరి నుంచి సన్నబియ్యం పథకం: ఉత్తమ్

image

TG: జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. అందులో 36లక్షల టన్నులు పీడీఎస్‌కు వచ్చినా సరిపోతుందన్నారు. నెలకు 2 లక్షల టన్నుల చొప్పున పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.

Similar News

News November 27, 2025

సిద్దిపేట: యువకుడి సూసైడ్.. ముగ్గురిపై కేసు

image

ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్గల్ మం. అంబర్‌పేట వాసి పవన్ కళ్యాణ్(21), ఓ యువతి ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఇంటికి వెళ్లిన పవన్‌పై యువతి తండ్రి శ్రీనివాస్, మహేష్, తిరుపతి కలిసి దాడి చేశారు. దీంతో గడ్డి మందు తాగిన పవన్ చికిత్స పొందుతూ ఈనెల 25 మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురిని రిమాండ్ చేశారు.

News November 27, 2025

రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

image

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.